అమెరికాలో 'ఇడా' హరికేన్(Hurricane Ida) బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా న్యూ ఆర్లీన్స్ ప్రాంతంలో మిస్సిసిప్పీ నది(Mississippi River).. వ్యతిరేక దిశలో ప్రయాణించింది. దీన్ని అత్యంత అసాధారణమైన విషయంగా అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
Hurricane Ida: తుఫాన్ ఎఫెక్ట్- రివర్స్ గేర్లో ప్రవహిస్తున్న నది! - వ్యతిరేక దిశలో మిస్సిసిప్పీ నది
అమెరికాను 'ఇడా' హరికేన్(Hurricane Ida) వణికిస్తోంది. ప్రచండ గాలుల ధాటికి మిస్సిసిప్పీ(Mississippi River) నది వ్యతిరేక దిశలో ప్రవహించి ఆశ్చర్యపరిచింది. మరోవైపు.. తుపాను ప్రభావంతో అమెరికా ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు.
ఇడా తుపాను
కేటగిరీ-4గా (గరిష్టం కన్నా ఒక దశ తక్కువ) ప్రకటించిన ఈ తుపాను.. మెక్సికో ఉత్తర గల్ఫ్‌ను దాటి లూసియానా తీరాన్ని తాకింది. ఇడా.. న్యూ ఆర్లీన్స్కు దక్షిణాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ ఫోర్చౌన్ వద్ద తీరాన్ని తాకినట్లు జాతీయ హరికేన్ సెంటర్ ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) వెల్లడించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:నేలపై వాలిన మేఘాలు.. పాల సంద్రాన్ని తలపించే దృశ్యాలు
Last Updated : Aug 30, 2021, 3:27 PM IST