ఆధునిక ప్రపంచంలో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంటారు. సమయం లేదంటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టని వారు కొందరైతే.. శారీరక శ్రమ చేయడానికి ఇష్టపడని వారు మరికొందరు. అయితే శారీరక శ్రమకు మించిన ఆరోగ్యం లేదని చెబుతున్నారు అమెరికాకు చెందిన నేషనల్ క్యాన్సర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు
రోజూ నడిచే నడకకు ఎన్ని అడుగులు జోడిస్తే అంత ఆరోగ్యం మీ సొంతం అని అంటున్నారు పరిశోధకులు. ఇందుకు సంబంధించిన ఓ పరిశోధనను అమెరికా మెడికల్ అసోషియేషన్ జర్నల్లో ప్రచురించారు. రోజూ ఎంత ఎక్కువ నడిస్తే అంత ఆయుష్షు పెరుగుతుందని చెబుతుందీ సర్వే.
" శారీరక శ్రమ ఆరోగ్యానికి మంచిదనే విషయం మాకు తెలుసు. అయితే రోజు ఎన్ని అడుగులు వేస్తే మంచిదనేది తెలీదు. అంతేకాకుండా కాస్త బలాన్ని ఉపయోగించి అడుగేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా తెలీదు. అందుకు వ్యాయామ నిపుణులను కలిసి ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలనుకున్నాం."