హాలోవీన్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అక్టోబర్ 31న ‘హాలోవీన్ డే’ను ఘనంగా చేసుకుంటారు. ముఖం గుర్తు పట్టకుండా ఉండేలా మేకప్ వేసుకుంటారు. విచిత్ర వేషధారణతో భయపెడుతుంటారు.
ఎందుకు..?
హాలోవీన్ ఇప్పటి వేడుక కాదు. ప్రాచీనకాలం నుంచి వస్తున్న పండుగ. శతాబ్దాలుగా ఆయా దేశాల్లో ఉన్న మూఢనమ్మకాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. దయ్యాలను పారదోలటానికి ప్రజలు మంటలను వెలిగించి వైవిధ్యమైన వేషాలు ధరిస్తుండేవారు. అలా వేషధారణ చేసుకుంటే భూతాలు వారి దరి చేరవని నమ్మకం. అలా వీరంతా కలిసి, ముఖ్యంగా క్యాథోలిక్స్ నవంబర్ 1న సెయింట్స్‌కి ప్రార్థనలు చేసేవారు. ఆ రోజు 'అల్ సెయింట్స్ డే' అని అంటారు. అల్ సెయింట్స్‌డే ముందు రోజు రాత్రిని 'అల్ హాలోస్' పండుగగా జరుపుకోవడం ప్రారంభించారు. ఆ రోజున అందరూ తాము అమితంగా ప్రేమించి.. చనిపోయిన వారి ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తుంటారు.
ఆ తర్వాత కాలంలో ఇదే 'హాలోవిన్' డే గా మారింది. ఈ సంప్రదాయాలు, నమ్మకాల సంగతి ఎలావున్నా నగరవాసులు మాత్రం దీన్నో ఆనందకర పండుగగా మార్చేశారు. వినూత్న దుస్తులు, ముఖానికి రంగులు, భయపెట్టే అలంకరణతో ఈ పండుగను చేసుకుంటారు. అత్యంత భయంకరంగా వేషధారణ వేసుకుంటూ క్లబ్స్‌లో, రెస్టారెంట్లో డీజే మ్యూజిక్‌తో సేద తీరుతూ సందడి చేస్తుంటారు.
లండన్