అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
ఇదీ చదవండి:పాకిస్థాన్లో హిందూ జర్నలిస్టు హత్య
ఏం జరిగిందంటే?
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
ఇదీ చదవండి:పాకిస్థాన్లో హిందూ జర్నలిస్టు హత్య
ఏం జరిగిందంటే?
ఉత్తర ఫిలడెల్ఫియాలోని నైస్టౌన్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఓ అనధికారిక సమావేశం జరిగింది. కొవిడ్ నిబంధనలను పక్కనపెట్టి.. ఓ అద్దె భవనం వెలుపల, లోపల అనేక మంది గుమిగూడారు. ఇది గమనించిన స్థానిక పెట్రోలింగ్ అధికారులు.. వారిని చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 29ఏళ్ల వ్యక్తిపై 14సార్లు కాల్పులు జరగ్గా.. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు పురుషులు, ఓ మహిళకు గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి పెద్ద సమావేశాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని అక్కడి పోలీస్ కమిషనర్ డేనియల్ ఔట్లా తెలిపారు. కొవిడ్ మార్గనిర్దేశాల ప్రకారం.. వీటిని నిరోధించేందుకు గస్తీ మరింత విస్తరిస్తామని ఆమె పేర్కొన్నారు.