తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 83వేలు దాటిన కరోనా మరణాలు - coronavirus cases globally

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. వైరస్​ కారణంగా విలవిలలాడుతున్న స్పెయిన్​లో ఒక్కరోజే 759మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 14,555కు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 83వేల మందికిపైగా మృతి చెందారు. 14లక్షలకు పైగా వ్యాధి బారిన పడ్డారు.

Global COVID-19 tracker
ప్రపంచవ్యాప్తంగా 83వేలు దాటిన కరోనా మరణాలు

By

Published : Apr 8, 2020, 6:30 PM IST

స్పెయిన్​లో కరోనా మహమ్మారి విలయతాండవం ఆగడం లేదు. ఒక్కరోజులోనే 759మంది వైరస్​కు బలయ్యారు. ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం 14,555 మంది మరణించగా, కేసుల సంఖ్య 1,46,690కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 14,44,822కు పెరిగి 15 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 83,109గా ఉంది. వైరస్​ కారణంగా అత్యధికంగా ఇటలీలో 17,127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా(12,857) ఉన్నాయి.

కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు

కరోనా వివరాలు అంకెల్లో

పాక్​లో 4వేలకుపైగా..

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 4,702కు చేరింది. మొత్తం 58మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​పై పోరులో భాగంగా టాప్​ కమాండర్లంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆ దేశ సైన్యాధిపతి ఖమార్ జావేద్ భాజ్వా సూచించారు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనల మేరకు స్వీయ నిర్భంధంలో ఉండాలని కోరారు. పాక్​ పంజాబ్​లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 50మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: వైరస్​ పుట్టినిల్లు వుహాన్​లో లాక్​డౌన్​ ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details