పాములు నీటిలో తేలియాడటం మామూలే. కానీ అనకొండ నీటిలో మునిగి హాయిగా.. సేదతీరడం మీరెప్పుడైనా చూశారా? అనకొండ ఏంటీ..? సరదాగా ఎంజాయ్ చేయడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయాల్సిందే.!
వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ సాహసాలు చేసే బ్రియాన్ బార్జిక్ అనే జంతు ప్రేమికుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. పాముల సంరక్షణ కేంద్రం(రెప్టోరియం)లో ఉన్న ఈ పసుపు పచ్చని అనకొండ పేరు 'ఐవీ' అని ఆయన తెలిపారు.