అమెరికా ఫ్లోరిడాలో ల్యాండ్ అవుతుండగా.. బోయింగ్-737 విమానం రన్‌వేపై అదుపు తప్పి పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. క్యూబా నుంచి అమెరికా వచ్చిన ఈ విమానం ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేలో దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఏడుగురు సిబ్బందితో పాటు 136 మంది ప్రయాణికులున్నారు. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలు తెలియజేస్తామన్నారు.
నదిలోకి విమానం- ప్రయాణికులు సురక్షితం - plane accident
అమెరికా ఫ్లోరిడాలో విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు సిబ్బందితో పాటు 136 మందితో ప్రయణిస్తున్న బోయింగ్-737 విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వల్పగాయాల పాలైన 21 మందికి ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు.
నదిలోకి దూసుకెళ్లిన బోయింగ్ విమానం
" బోయింగ్ 737 విమానం ప్రమాద ఘటనలో 21 మందిని ఆసుపత్రికి తరలించాం.. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరి పరిస్థితీ విషమంగా లేదు. 80మందికిపైగా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు."
-సహాయక అధికారి.
ఇదీ చూడండి: అమెరికాలో 49 ఏళ్ల రికార్డు బద్దలు..!
Last Updated : May 4, 2019, 12:45 PM IST