తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానాలపై లేజర్​లైట్​... చివరికి అరెస్ట్​! - లేజర్​లైట్ల కలకలం

లేజర్​లైట్లు ఉన్న తుపాకులు మనం సినిమాల్లో చూసే ఉంటాం. లక్ష్యంపై గురిపెట్టడానికి వీటిని​ ఉపయోగిస్తుంటారు. ఇలాంటి లేజర్​ లైట్లను విమానాశ్రయంలో వినియోగించిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. మరి అతను చేసిన తప్పేంటి.? ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం!

Florida man arrested for pointing lasers as planes landed
విమానాశ్రయంలో కలకలం సృష్టించిన లేజర్​లైట్లు

By

Published : Jan 26, 2020, 1:34 PM IST

Updated : Feb 25, 2020, 4:22 PM IST

ఫ్లోరిడా విమానాశ్రయంలో వచ్చిపోయే విమానాలపై లేజర్​లైట్లు ప్రయోగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వింతచేష్టల కారణంగా ఓ పైలట్ గాయపడ్డాడు.

ఇదీ జరిగింది...

చార్లీ చాప్​మన్​ అనే వ్యక్తి కొంత కాలంగా విమానాలపై లేజర్​లైట్లు ప్రయోగిస్తూ.. పైలట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీనిపై పైలట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత వారం ఫ్లోరిడాలోని సరసోటా బ్రాడెంటోన్​ విమానాశ్రయంలో నాలుగు సార్లు విమానాలపై లేజర్​ కిరణాలను ప్రయోగించాడు. అదే క్రమంలో పోలీసుల హెలికాఫ్టర్​పైనా లేజర్​లైట్​ వేశాడు.

లేజర్​ లైట్ల ఘటనపై ఓ పైలట్​ ఫిర్యాదు చేస్తూ... ఆ కిరణాల కారణంగా తనకు తాత్కాలికంగా కంటి చూపు మందగించిందని పేర్కొన్నాడు. అక్కడున్న కెమెరాల్లో ఓ వ్యక్తి... పోలీసుల హెలికాఫ్టర్​పై వస్తువులు విసురుతున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి.

స్టన్​గన్​తో నిందితుడికి షాక్​!

విమానాశ్రయంలో లేజర్​ కిరణాల ఘటనపై పలువురు పైలట్లు ఫిర్యాదు చేసిన క్రమంలో రంగంలోకి దిగారు పోలీసులు. ఆగంతుకుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. అతని వద్దకు పోలీసులు వెళ్లిన సమయంలో వారిపైకి సుత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతణ్ని అదుపు చేసేందుకు పోలీసులు స్టన్​గన్​ వినియోగించారు. నిందితుడి నుంచి లేజర్​ కిరణాల పరికరాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి:కంచెను ఢీకొని కూలిన విమానం.. నలుగురు మృతి

Last Updated : Feb 25, 2020, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details