అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకు వ్యాపిస్తోంది. రాష్ట్రంలోని ఉత్తర కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటలు నివాస ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్లుమాస్, లాసెన్ సియెర్రా కౌంటీ ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.
వేడిని తట్టుకోలేక..
మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. కానీపెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటల వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అగ్నిమాపక బృందాల సహాయం కోరారు అధికారులు. ఈ మేరకు భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలల వీడియోను ట్వీట్ చేసింది అగ్నిమాపక విభాగం.