తెలంగాణ

telangana

ETV Bharat / international

'బైడెన్​, ట్రంప్​లకు కరోనా టీకా ఇవ్వాలి' - COVID-19 vaccine

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్​లకు కరోనా టీకా వేయించాలన్నారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ. వీరితో సహా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఉపాధ్యకుడు మైక్​ పెన్స్​లకు టీకా అందించాలని సూచించారు.

Fauci says vaccinate Biden, Harris, Trump, Pence
బైడెన్​, ట్రంప్​లకు కరోనా టీకా!

By

Published : Dec 16, 2020, 12:29 PM IST

అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్​లకు ​వీలైనంత త్వరగా వ్యాక్సిన్​ వేయాలన్నారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్​ ఆంథోని ఫౌచీ. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బైడెన్​ పూర్తి రక్షణతో జనవరిలో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఫాచీ పేర్కొన్నారు.

అదేమాదిరిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​లకూ టీకా​ వేయాలని సూచించారు ఫాచీ. ఇప్పటికే కరోనా బారిన పడిన ట్రంప్​ శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ.. మరింత సురక్షితంగా ఉండేందుకు వ్యాక్సిన్​ ఉపయోగపడుతుందన్నారు.

ఇదీ చూడండి:'గాంధీ విగ్రహ అపవిత్రం అత్యంత దారుణం'

ABOUT THE AUTHOR

...view details