తెలంగాణ

telangana

ETV Bharat / international

జైలులో 'అమ్మ'ల ఫ్యాషన్​ షో అదుర్స్​

పెరు రాజధాని లిమాలోని జైలులో 'మదర్స్​​ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. జైలులోని అమ్మలకు ప్రత్యేక ష్యాషన్​ షో నిర్వహించారు.

జైలులో 'అమ్మ'ల ఫ్యాషన్​ షో అదుర్స్​

By

Published : May 11, 2019, 3:33 PM IST

జైలులో 'అమ్మ'ల ఫ్యాషన్​ షో అదుర్స్​

పెరు రాజధాని లిమాలో 'మదర్స్​ డే'ను పురస్కరించుకుని జైలులోని అమ్మల కోసం ప్రత్యేక ఫ్యాషన్​ షో నిర్వహించారు.​ మహిళా ఖైదీలు తయారు చేసిన దుస్తులు, బ్యాగ్​లు, నగలు, పెళ్లి గౌనులు, షూలు ధరించి వయ్యారంగా నడిచారు అక్కడి అమ్మలు.

'ద హార్ట్​ ఆఫ్​ ఏ ఉమెన్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైదీలు విడుదలయ్యాక ఉపాధి దక్కాలనే గొప్ప ఆలోచనతో ఇక్కడ వారికి ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. 'ప్రొడక్టివ్​ ప్రిజన్స్' పేరుతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

జైలు జీవితం గడిపిన కొంత మంది విడుదలయ్యాక ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించారు. మరి కొంతమంది నగల తయారీ సంస్థలకు యజమానులుగా ఎదిగారు.

"ఈ నైపుణ్యాన్ని ఇక్కడే (జైలు)లో సంపాదించాను. ఇక్కడ నేర్చుకున్న ఈ విద్య ద్వారా నా చేతుల్తో ఇలాంటి గొప్ప వస్తువులు తయారు చేస్తానని ఊహించలేదు. ప్రస్తుతం మేము చెప్పుకోదగ్గ నగలు, కొత్త డిజైన్లు తయారు చేయగలుగుతున్నాం. ఇది కచ్చితంగా సృజనాత్మకతే."
-అలిజాండ్రా జిగర్రా, ఖైదీ

పెరులోని చొరిజో కారాగారంలో 740 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. ఇందులో అధిక శాతం మాదకద్రవ్యాల తరలింపులో పట్టుబడినవారే.

ABOUT THE AUTHOR

...view details