విజయవంతంగా అంతరిక్ష కేంద్రాన్ని చేరిన స్పేస్-ఎక్స్ డ్రాగన్‌క్యాప్సూల్ భూమికి తిరిగి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మానవుడు డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సులువుగా చేరుకోవచ్చు.
క్షేమంగా చేరిన డ్రాగన్ క్యాప్సూల్ - iss
స్పేస్-ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. భూ కక్ష్యలోకి ప్రవేశించగానే వాతావరణ మార్పిడికి ఏర్పడే కీలకమైన వేడిని తట్టుకునే పరీక్ష ఎదుర్కొంది. ఆరు గంటల ప్రయాణం అనంతరం అమెరికా ఫ్లోరిడా తీరంలో దిగింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ క్యాప్సూల్ మధ్యాహ్నం విడిపోయింది. ఆరు గంటల ప్రయాణం అనంతరం భూ కక్ష్యను చేరుకొంది. అంతరిక్షానికి పంపిన క్యాప్సూల్ తిరిగి రావడం50 ఏళ్ల తర్వాతఇదే తొలిసారి. ఇక వీటి ద్వారా అంతరిక్షానికి మానవులను పంపే ప్రయత్నాలు ప్రారంభించారు శాస్త్రవేత్తలు.
వాతావరణ వేడి పరీక్ష అనేది కీలకమైనది. ల్యాండింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎటువంటి సమస్య లేకుండా డ్రాగన్‌ను అనుసంధానించాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు వ్యోమగాములు విజయవంతంగా డ్రాగన్ క్యాప్సూల్ తెరవగలిగారు. -ఎలాన్ మస్క్ , స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత