తెలంగాణ

telangana

ETV Bharat / international

బహమాస్​: డొరైన్​ బీభత్సానికి 30 మంది బలి

బహమాస్​లో డొరైన్​ విజృంభిస్తోంది. తుపాను ప్రతాపానికి ఇప్పటివరకు 30 మంది మరణించారని దేశ ప్రధాని మిన్నిస్​ తెలిపారు. దేశంలో దాదాపు 70 వేల మందికి తక్షణ సహాయం అవసరమని ఐరాస తెలిపింది.

బహమాస్​: డొరైన్​ బీభత్సానికి 30 మంది బలి

By

Published : Sep 6, 2019, 9:19 AM IST

Updated : Sep 29, 2019, 3:04 PM IST

బహమాస్​: డొరైన్​ బీభత్సానికి 30 మంది బలి

ఉత్తర అమెరికా ద్వీపకల్ప దేశం బహమాస్​పై డొరైన్​ బీభత్సం సృష్టిస్తూనే ఉంది. తుపాను ప్రభావానికి ఇప్పటికి 30 మంది మరణించారని దేశ ప్రధాని హుబెర్ట్​ మిన్నిస్​ తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, డొరైన్​ తుపాను వేలాది మంది జీవితాలపై ప్రభావం చూపిందని అన్నారు.

బహమాస్​లో నివసిస్తున్న 70 వేల మందికి ప్రస్తుతం తక్షణ సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కేటగిరీ-2 తుపానుగా మారిన డొరైన్​.. అమెరికాలోని ఉత్తర, దక్షిణ కరోలినాకు విస్తరించింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు.

ఇదీ చూడండి:పడవలోని ఆ 34 మంది అగ్నికి ఆహుతయ్యారు!

Last Updated : Sep 29, 2019, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details