ఉత్తర కొరియా భూభాగంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో అడుగుపెట్టటం ఇదే తొలిసారి. ఉభయ కొరియాల సరిహద్దుల్లోని డీఎంజీ(సైనికరహిత) ప్రాంతానికి వచ్చిన ట్రంప్‌ను కిమ్ జోంగ్ ఉన్ కలిశారు. ఇరు దేశాధినేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు.
అనుకోకుండా ఇక్కడికి వచ్చి కిమ్‌ను కలవటం సంతోషంగా ఉందన్నారు ట్రంప్. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. తాము కలిసిన మొదటి రోజు నుంచే ఇరువురి స్నేహబంధం బలపడిందన్నారు ట్రంప్.