తెలంగాణ

telangana

ETV Bharat / international

అభిమానికి ట్రంప్​ ఫోన్​ - అభిమాని

ప్రమాదక వ్యాధితో బాధపడుతున్న ఓ వీరాభిమానికి ట్రంప్​ స్వయంగా ఫోన్​ చేశారు. కాసేపు మాట్లాడారు. ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అభిమానికి ట్రంప్​ ఫోన్​

By

Published : Mar 7, 2019, 3:42 PM IST

జే బర్రెట్​ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు వీరాభిమాని. అతడు కిస్టిక్​ ఫిబ్రోసిస్​ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స తీసుకుంటున్నాడు. అతడి సోదరి బ్రిడ్​గేట్​ డెమొక్రటిక్ పార్టీ స్థానిక​ నాయకురాలు. ఆమె ఓ వీడియో ఫేస్​బుక్​లో షేర్​ చేశారు. తన సోదరుడికి ట్రంప్​ ఫోన్​ చేశారని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఫోన్​ సంభాషణ వీడియో స్పష్టంగా వినిపిస్తోంది.

"నీవూ నాలాంటి వాడివే. నీ పట్ల గర్వంగా ఉంది. వ్యాధితో పోరాడుతూనే ఉండు. మనమిద్దరం పోరాడదాం. నేను మళ్లీ మాట్లాడతా." అని ట్రంప్​ జే బర్రెట్​తో అన్నారు.
ఏదేమైనా నేను మీకు మద్దతుగానే ఉంటానని బర్రెట్​ సమాధామిచ్చారు.

"త్వరలో నువ్వు ర్యాలీలో పాల్గొంటావని ఆశిస్తున్నా" అన్న ట్రంప్​ మాటలకు స్పందించాడు బెర్రెట్​. "నేను మృతి చెందేలోగా వాషింగ్టన్​ రావాలని అనుకుంటున్నా. 2020 అధ్యక్ష ఎన్నికల్లో మీకే ఓటేయాలని ఆశిస్తున్నా" అని బర్రెట్​ అన్నాడు.

ఫోన్లో మాటలు పూర్తయ్యాక "నేను మాట్లాడింది అమెరికా అధ్యక్షుడితోనేనా" అంటూ బర్రెట్​ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేశాడు.

అభిమానికి ట్రంప్​ ఫోన్​

ABOUT THE AUTHOR

...view details