తెలంగాణ

telangana

ETV Bharat / international

పాపం ట్రంప్... ఫోర్బ్స్​ సంపన్నుల జాబితా నుంచి ఔట్! - ఫోర్బ్స్‌ డోనాల్డ్ ట్రంప్

ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజిన్ రూపొందించిన 400 మంది అత్యంత ధనవంతుల జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానం కోల్పోయారు. గత 25 ఏళ్లలో మొదటిసారిగా ఆయన సంపద కరిగిపోయినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.

Donald Trump
ట్రంప్

By

Published : Oct 6, 2021, 2:55 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ సంపన్నుల జాబితాలో(ఫోర్బ్స్-400) స్థానం కోల్పోయారు. అమెరికాలోని అత్యంత సంపన్నులతో ఈ జాబితా రూపొందిస్తుంది ఫోర్బ్స్ మేగజిన్. గడచిన 25 ఏళ్లలో తొలిసారి ఆయన ఈ జాబితాలో చోటు కోల్పోవడం గమనార్హం.

కరోనా విజృంభణతో ట్రంప్ సంపద 600 మిలియన్ డాలర్లు తగ్గిందని ఫోర్బ్స్ తెలిపింది. ప్రస్తుతం ట్రంప్ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లు. కానీ.. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే మరో 400 మిలియన్ డాలర్లు అవసరం.

"2016లో అధ్యక్షునిగా ఎన్నికైన కొత్తలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల నుంచి దూరంగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ ఆస్తులను వికేంద్రీకరించాలని ఫెడరల్ ఎథిక్స్ అధికారులు ట్రంప్​పై ఒత్తిడి చేశారు. అలా చేసి ఉంటే విస్తృత ఆదాయాన్నిచ్చే ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆయనకు అవకాశం లభించేది. అయితే.. వాటిని అట్టిపెట్టుకునేందుకే ట్రంప్ మొగ్గుచూపారు. ఒకవేళ అలా చేయకుండా ఉంటే రుణభారం పోను 3.5 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ట్రంప్ కలిగి ఉండేవారు" అని పేర్కొంది ఫోర్బ్స్​.

మొత్తంగా తన ఆస్తులు కరిగిపోవడానికి స్వయంగా ట్రంపే కారణమని ఫోర్బ్స్ పత్రిక అభిప్రాయపడింది. 'ఆయన ఎవరినైనా నిందించాలంటే.. మొదట తనను తానే నిందించుకోవాలి' అని వ్యాఖ్యానించింది. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడానికి కొద్ది రోజుల ముందు.. 'ప్రభుత్వాన్ని, వ్యాపారాన్ని సమర్థంగా నడపగలను' అని ట్రంప్ పేర్కొన్నట్లు గుర్తుచేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details