తెలంగాణ

telangana

ETV Bharat / international

మరోసారి కొవిడ్​ పంజా- సాధారణ పరిస్థితి కలేనా? - డెల్టా వ్యారియంట్

టీకాల(Corona vaccine) పంపిణీ, కఠిన ఆంక్షలతో క్రమంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు(Corona cases) మరోసారి పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. గతవారం పెరిగిన మరణాలు, కేసులు.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

Coronavirus
కరోనా

By

Published : Jul 15, 2021, 12:08 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్(Covid-19) మరణాలు, కేసులు మరోసారి పెరగడం.. సాధారణ పరిస్థితులకు తిరిగి చేరతామనే ఆశలకు గండికొడుతోంది. మరోమారు ఆంక్షల విధింపు ఉంటుందనే ఆందోళన నెలకొంది. వరుసగా 9 వారాలపాటు తగ్గుతూ వచ్చిన కరోనా మరణాలు గతవారం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం వెల్లడించింది. ఏకంగా 55 వేల మంది కరోనాకు బలయ్యారని, అది అంతకుముందు వారంతో పోలిస్తే 3శాతం అధికమని తెలిపింది. బ్రెజిల్, భారత్, ఇండోనేషియా, బ్రిటన్​లో అత్యధిక కేసులతో అంతకుముందు వారంతో పోలిస్తే గతవారం 10 శాతం పెరిగి దాదాపు 30లక్షల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

కొంపముంచిన నిర్లక్ష్యం..

అయితే అత్యల్ప స్థాయిలో టీకా పంపిణీ(Vaccination), మాస్కులు ధరించకపోవడం, ఆంక్షల సడలింపు సహా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంటే పరిస్థితి దిగజారడానికి కారణమని డబ్ల్యూహెచ్​ఓ విశ్లేషించింది. ప్రస్తుతం 111 దేశాల్లో డెల్టా రకం వైరస్​ను గుర్తించగా, రాబోయే రోజుల్లో అది మరింత తీవ్ర రూపం దాల్చనుందని అంచనా వేస్తోంది.

సడలింపులో జాగ్రత్త..

జనవరిలో రోజుకు 18 వేల మరణాలు సంభవించగా, 7 నెలల క్రితం ప్రారంభమైన టీకా కార్యక్రమంతో ప్రస్తుతానికి రోజువారీ మరణాలు 7900లకు దిగొచ్చాయి. కాగా, అమల్లో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని చాలా దేశాల్లో ఒత్తిడి పెరుగుతోందని, అయితే అది సరైన పద్ధతిలో జరగకపోతే వైరస్​ వ్యాప్తికి మరింత అవకాశమిచ్చినట్లు అవుతుందని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది.

ఇదీ చూడండి:కరోనా వేళ ఇలా ఉంటే ఆనందం!

ABOUT THE AUTHOR

...view details