తెలంగాణ

telangana

ETV Bharat / international

2024లో జాబిలిపైకి  నాసా "చంద్రయాన్​"...

దశాబ్దాల అనంతరం చందమామపై కాలుమోపడానికి నాసా నిర్ణయించిన మిషన్​ 'అర్తెమిస్​.' ఈ ప్రతిష్టాత్మక మిషన్​కు చెందిన మరిన్ని వివరాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. ఈ మిషన్​లోనే తొలిసారి ఓ మహిళా వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టనుంది.

2024లో జాబిల్లిపై నాసా "చంద్రయాన్​"

By

Published : May 24, 2019, 8:01 PM IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చంద్రుడితో ఎనలేని సంబంధం ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు చంద్రుడిపై పరిశోధనలు జరిపి ఎన్నో అద్భుత వింతలను ఆవిష్కరించింది. మరెన్నో విషయాలను మానవాళికి అందించింది. చంద్రునిపై మరోమారు కాలుమోపే అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధపడినట్టు ఇటీవలే ప్రకటించింది నాసా. ఆ మిషన్​కు 'అర్తెమిస్​' అనే పేరును ఖరారు చేసింది. తాజాగా అర్తెమిస్​కు సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించింది నాసా.

అర్తెమిస్​ 1..2..3

నాసా ఇంతకు ముందు అపోలో పేరుతో చంద్రుడి మీదకు వెళ్లేందుకు ప్రయోగాలు నిర్వహించింది. గ్రీకు పురాణాల ప్రకారం అర్తెమిస్... అపోలోకు కవల సోదరి​. అర్తెమిస్​ను మూడు మిషన్​లుగా విభజించింది నాసా.

'అర్తెమిస్​ 1' మానవ రహిత మిషన్​... 2020లో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. 'అర్తెమిస్​ 2'ను 2022లో ప్రయోగించనుంది నాసా. ఇందులో వ్యోమగాములు చంద్రుడి చుట్టు తిరుగుతారు. ఎన్నో దశాబ్దాల అనంతరం 2024లో 'అర్తెమిస్​ 3'తో వ్యోమగాములు మరోసారి చంద్రుడిపై కాలుమోపనున్నారు. చివరిసారిగా 1972లో మానవుడు జాబిలిపై కాలుమోపాడు. తొలిసారి ఓ మహిళా వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టడం 'అర్తెమిస్​ 3​'లోని మరో ప్రత్యేకత.

అర్తెమిస్​ను ప్రయోగించడానికి భారీ రాకెట్​ను ఉపయోగించనుంది నాసా. బోయింగ్​ నేతృత్వంలోని స్పేస్​ లాంఛ్​ సిస్టమ్​(ఎస్​ఎల్​ఎస్​)లో ఈ రాకెట్​ను రూపొందిస్తున్నారు.

అర్తెమిస్​తో పాటు...

ప్రతిష్టాత్మక అర్తెమిస్​ మిషన్​తో పాటు చందమామ కక్ష్యలో ఓ మినీ స్టేషన్​ను రూపొందించనుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ స్టేషన్​లోనే వ్యోమగాములు స్టే చేస్తారు. దీనికోసం 2022- 2024 మధ్య కాలంలో ఐదు రాకెట్లను ప్రయోగించనుంది నాసా.

ఇదీ చూడండి: రాజకీయ పార్టీల పేర్లు,జెండాలు,గుర్తులపై వ్యాజ్యం

ABOUT THE AUTHOR

...view details