తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ వర్గానికి చిక్కులు

ట్రంప్​ కుమారులు, అల్లుడు, ఇతర సన్నిహితులపై విచారణకు సిద్ధమైంది అమెరికా దిగువసభలోని న్యాయ వ్యవహారాల కమిటీ. మొత్తం 81 మందిపై గురిపెట్టింది. ఈ జాబితాలో ట్రంప్ కుమార్తె ఇవాంక లేకపోవడం విశేషం.

By

Published : Mar 5, 2019, 9:05 AM IST

ట్రంప్​పై బిగుస్తోన్న ఉచ్చు

అధికార దుర్వినియోగం, న్యాయవ్యవస్థ కార్యకలాపాలు అడ్డుకోవడం వంటి ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వర్గంపై విచారణకు సిద్ధమయ్యారు డెమొక్రాట్లు. ప్రతిపక్షానికి ఆధిక్యమున్న దిగువసభలోని న్యాయ వ్యవహారాల కమిటీ ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది.

ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, వేర్వేరు పత్రాలు సమర్పించాలని ఆదేశిస్తూ హౌస్​ కమిటీ 81మందికి లేఖలు రాసింది. ట్రంప్​ సహా ఆయన ప్రభుత్వం ఏమైనా అక్రమాలకు పాల్పడిందా అన్న విషయాన్ని బయటపెట్టే సమాచారం ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది.

కఠినపదజాలంతో హౌస్​ కమిటీ రాసిన లేఖలు అందుకున్నవారిలో ట్రంప్​ కుటుంబసభ్యులు, రాజకీయ సన్నిహితులు, వేర్వేరు సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ట్రంప్​ కుమారులు డాన్​ జూనియర్, ఎరిక్​, అల్లుడు జారెడ్​ కుష్నర్​కు లేఖలు రాసింది కమిటీ. శ్వేతసౌధంలో సీనియర్​ సలహాదారైన ట్రంప్​ కుమార్తె ఇవాంక ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details