అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం సిగ్గుచేటు అని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
ఇదీ జరిగింది...

అఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఓ పోలీసు అధికారి కర్కశత్వానికి మరణించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఈ నెల 2,3వ తేదీల్లో.. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని పలువురు ధ్వంసం చేశారు. స్ప్రేలు, గ్రాఫిటీలతో విగ్రహంపై పెయింటింగ్స్ వేశారు.
ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై అతి త్వరగా దర్యాప్తు జరపాలని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌ను కోరింది.
విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌తో పాటు మెట్రోపాలిటిన్ పోలీస్, నేషనల్ పార్క్ సర్వీస్‌తో కలిసి పని చేస్తోంది.