ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / international

కూలిన భవనం- 11కు చేరిన మృతులు - ఫ్లోరిడాలో కుప్పకూలిన భవనం

అమెరికా ఫ్లోరిడాలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 136 మందిని శిథిలాల నుంచి బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు.

Florida building collapse rises to 11
కుప్పకూలిన 12 అంతస్తుల భవనం
author img

By

Published : Jun 29, 2021, 9:01 AM IST

అమెరికా ఫ్లోరిడాలో 12 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఘటనా సమయంలో మొత్తం 159 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 136 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు పేర్కొన్నారు. దాదాపు 400 మంది సిబ్బందితో సహాయక చర్యలను ముమ్మరం చేశామన్నారు.

ఈ బహుళ అంతస్థుల భవనంలో అమెరికా దేశస్థులతో పాటు పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details