తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా యాప్స్​ నిషేధం: భారత్​ బాటలో అమెరికా! - చైనా యాప్స్​ నిషేధం

చైనాపై గత కొంత కాలంగా తీవ్ర అసహనంతో ఉన్న అమెరికా.. భారత్​ బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా యాప్స్​లను నిషేధించే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో పేర్కొనడమే ఇందుకు కారణం.

cretary of State Mike Pompeo says that the United States is "certainly looking at" banning Chinese social media apps, including #TikTok
చైనా యాప్స్​ నిషేధం: భారత్​ బాటలో అమెరికా!

By

Published : Jul 7, 2020, 10:27 AM IST

Updated : Jul 7, 2020, 11:10 AM IST

చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్ నిషేధించిన నేపథ్యంలో.. అమెరికా కూడా అదే బాటలో పయనించే అవకాశాలు ఉన్నాయి. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన సామాజిక మాధ్యమ యాప్‌లను నిషేధించే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. 'ఈ విష‌యాన్ని అధ్య‌క్షు‌డు ట్రంప్ కన్నాముందే బ‌హిరంగప‌ర‌చ‌డం ఇష్టం లేదు, కానీ.. క‌చ్చితంగా చైనా యాప్‌ల‌ను నిషేధించే యోచ‌న‌లో ఉన్నాం' అని మైక్ పాంపియో స్ప‌ష్టం చేశారు.

విదేశాల్లో ఉన్న సర్వర్ల ద్వారా.. భారతీయుల డేటాను ఆయా యాప్‌లు తరలిస్తున్నాయనే ఫిర్యాదులతో భారత్‌ టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌ల్ని నిషేధించింది. ఇప్పుడు ఇదే అంశాన్ని అమెరికా కూడా పరిశీలిస్తోంది. వాణిజ్య యుద్ధం మొదలు, కరోనా వైరస్ వ్యాప్తి వరకూ అనేక అంశాల్లో చైనాతో అమెరికాకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. వేర్వేరు కారణాలతో చైనా టెలికాం సంస్థలపైనా.. అమెరికా పలు ఆంక్షలు విధించింది. తాజాగా యాప్‌లపైనా దృష్టి సారించింది.

ఇదీ చూడండి:-అగమ్యగోచరంగా చైనా యాప్​ల భవితవ్యం

Last Updated : Jul 7, 2020, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details