ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 6.71 కోట్ల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. వారిలో 15.38 లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది. ఇప్పటివరకు 4కోట్ల 64లక్షల మంది వైరస్‌ను జయించారు. కోటీ 91లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 1.5కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.87లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.
- రష్యాలో ఆదివారం ఒక్కరోజే 29,039 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 60వేలు దాటింది. ఆ దేశంలో ఇప్పటివరకు 43,141 మందిని కరోనా బలితీసుకుంది.
- టర్కీలో వైరస్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 30వేలకుపైగా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.
- పాక్‌లో మరో 3,308 మంది కరోనా బారినపడగా.. నేపాల్‌లో 1,096 కేసులు బయటపడ్డాయి.