తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2020, 8:21 PM IST

ETV Bharat / international

మాస్క్​ తప్పనిసరి- చట్టం చేసిన బ్రెజిల్​

వీధులు, ప్రజా రవాణా వేదికల్లో ఇకపై మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ బ్రెజిల్​ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. దేశంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చర్చిలు, ఫ్యాక్టరీలు, స్కూళ్లకు ఈ చట్టం నుంచి మినహాయింపునిచ్చింది.

COVID-19: Brazil approves law requiring masks on streets, public transport
వీధుల్లో మాస్కులు ధరించడం కోసం బ్రెజిల్​ చట్టం.. కానీ

బ్రెజిల్​లో కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో.. కీలక చట్టానికి ఆమోదం తెలిపారు ఆ దేశాధ్యక్షుడు బొల్సొనారో. ఈ చట్టం ప్రకారం.. కరోనా వైరస్​ కట్టడి కోసం బహిరంగ ప్రదేశాలు, వీధులు, ప్రజా రవాణా వేదికల్లో ప్రతి ఒక్కరు మాస్కులను తప్పనిసరిగా ధరించాలి.

అయితే చర్చిలు, పాఠశాలలు, దుకాణాలు, ఫ్యాక్టరీలకు ఈ చట్టం నుంచి మినహాయింపునిచ్చారు అధ్యక్షుడు. ఈ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలను ఆదేశిస్తే.. అది ఆస్తి హక్కులను ఉల్లంఘించినట్టు అవుతుందన్నారు. దీనితో పాటు పేదలకు, ఉద్యోగులకు ప్రభుత్వం మాస్కులను సరఫరా చేయకూడదని తేల్చారు.

కరోనా వైరస్​ కేసుల సంఖ్యలో బ్రెజిల్​ ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 15,45,458 కేసులు నమోదయ్యాయి. 63,295మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పరీక్షలు సరిగ్గా జరగడం లేదని నిపుణులు ఆరోపిస్తున్నారు. అందుకే కేసుల సంఖ్య తక్కువగా ఉందంటున్నారు.

పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ బ్రెజిల్​వాసుల్లో చాలా మంది మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం నియమాన్ని పాటించడం లేదు. కరోనా కట్టడి, ముఖ్యంగా మాస్కులు ధరించే విషయంలో అధ్యక్షుడు తీరుపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించకుండా అనేకమార్లు మీడియా కంటపడ్డారు బొల్సొనారో. ​

ఇదీ చూడండి:-'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'

ABOUT THE AUTHOR

...view details