అంతర్జాలంలో నకిలీ వార్తలు రోజూ కోకొల్లలుగా దర్శనమిస్తాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఐరాస వేదికగా నడుం బిగించాయి ప్రపంచదేశాలు. మొత్తం 20 దేశాలు నకిలీ వార్తలను అరికట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లో ఫ్రాన్స్, బ్రిటన్, దక్షిణాఫ్రికా, కెనడా, భారత్ సహా మరికొన్ని దేశాలు ఉన్నాయి. విశ్వసనీయ, వైవిధ్య, నమ్మదగిన వార్తలను మాత్రమే వ్యాప్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఒప్పందంలో పేర్కొన్నాయి సభ్యదేశాలు.
"డిజిటల్ ప్రపంచం విస్తారంగా వ్యాప్తి చెందుతోంది. సమాచార వ్యవస్థను నిత్య వార్తల ప్రవాహం కదిలిస్తోంది. ఇందులో పురోగతి ఎంత మేర ఉందో.. ప్రమాదమూ అంతే పొంచి ఉంది." - జీన్ ఎవెస్ లీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి