తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కరోనాకు 1000 మందికిపైగా బలి

కరోనా వైరస్​ ధాటికి ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్​ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 68వేల మందికిపైగా కరోనా బారిన పడగా.. వెయ్యి మందికిపైగా మృత్యువాతపడ్డారు. దీంతో వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనాను అతిపెద్ద ప్రజారోగ్య విపత్తుగా ప్రకటించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

Coronavirus cases in US cross 65,000 with more than 1,000 fatalities
అమెరికాలో కరోనా కేసులు @68వేలు

By

Published : Mar 26, 2020, 10:54 AM IST

కరోనా ధాటికి అమెరికా విలవిల్లాడుతోంది. వైరస్​ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బుధవారం ఒక్క రోజే అమెరికాలో 13వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆ దేశంలో మహమ్మారి ఉద్ధృతికి అద్దం పడుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 68, 572 మంది వైరస్​ బారినపడ్డారు. 1, 031 మంది మృతి చెందారు.

న్యూయార్క్​ సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్​ తీవ్రత అధికంగా ఉంది. భవిష్యత్​లో​ బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిఫుణులు చెబుతున్నారు. దీంతో కరోనాను అతిపెద్ద ఆరోగ్య విపత్తుగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

ఇదే మొదటిసారి..

ఇటీవల కాలంలో అమెరికాలో దాదాపు ఆరు రాష్ట్రాల్లో అరోగ్య విపత్తును ప్రకటించటం ఇదే మొదసారి. చాలా రాష్ట్రాల్లో అనధికార లాక్​డౌన్​ కొనసాగుతోంది. వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్​లో పరిస్థితి ఏ మాత్రం కుదుటపడలేదని ఆ దేశ ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే న్యూయార్క్​కు సహాయం చేయడానికి ​శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్​ పేర్కొన్నారు.

"ఇది మాకు అతిపెద్ద సమస్య కావచ్చు. కాకపోవచ్చు. అయితే చాలా మంది సమర్థులైన వారు మాతో కలిసి పని చేస్తున్నారు. మా బృందాలు రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాయి."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

భారీ ప్యాకేజీ..

దాదాపు 100మిలియన్ల మంది అమెరికా పౌరులు లాక్​డౌన్​ పరిస్థితుల్లో నివసిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో నివారణ చర్యలను చేపట్టిన అధ్యక్షుడు ట్రంప్​ 2 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. దీనికి అమెరికా ఎగువ సభ అమోదం తెలిపింది. అయితే బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలపాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details