ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తూనే ఉంది. వైరస్ ప్రభావంతో ప్రపంచ పెద్దన్నగా అభివర్ణించే అమెరికానే ఎక్కువగా కుదేలవుతోంది. యూఎస్‌లో కొత్తగా 1,425 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలగా.. కొవిడ్-19 మొత్తం బాధితుల సంఖ్య 11 లక్షలు దాటింది. ఆ దేశంలో ఇప్పటివరకు మొత్తం 64,018 మంది మృతి చెందారు. 1.56లక్షల మందికి పైగా వైరస్ బారినపడి కోలుకున్నారు.
యూఎస్‌లో కరోనా విలయతాండవం-11లక్షలకు కేసులు - Corona deaths in US
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 11 లక్షలు దాటినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. అక్కడ మొత్తం 64 వేల మంది మృతి చెందారు.
అమెరికాపై కరోనా ప్రతాపం.. 11 లక్షలు దాటిన కరోనా బాధితులు
ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల మందికి వైరస్ సోకితో వారిలో ఒక్క అమెరికాలోనే 11 లక్షల మందికి వైరస్ సోకడం గమనార్హం. ఒక్క న్యూయార్క్‌లోనే 3.10లక్షలు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా 33.36లక్షల మందికిపైగా వైరస్ పాజిటివ్‌గా తేలింది.
Last Updated : May 1, 2020, 11:24 PM IST