తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను లైంగికంగా వేధించారని ఈ జీన్​ కారోల్ అనే కాలమిస్ట్ తాజాగా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్​ ఖండించారు.

'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'

By

Published : Jun 22, 2019, 3:22 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై లైంగిక ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా న్యూయార్క్​కు చెందిన ఈ జీన్​ కారోల్ అనే కాలమిస్ట్​ ట్రంప్​ తనపై రెండు దశాబ్దాల క్రితం లైంగిక దాడి చేసినట్లు ఆరోపించారు. ​అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. అవాస్తవమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు.

కారోల్​ తన కొత్త పుస్తకం 'వాట్​ డు వీ​ నీడ్ మెన్​ ఫర్​?'లో ట్రంప్​ తనను వేధించారని, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 1990ల్లో స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న ట్రంప్​తో తనకు పరిచయం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ఒక రోజు డిపార్ట్​మెంటల్​ స్టోర్​ డ్రెస్సింగ్​ రూంలో ఉన్న తనతో ట్రంప్​ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.

అయితే ఈ విషయాన్ని తన స్నేహితులకు చెబితే, ట్రంప్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని సూచించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

తప్పుడు ఆరోపణలు

కారోల్​ ఆరోపణలను అధ్యక్షుడు ట్రంప్​ కొట్టిపారేశారు. తాను ఆమెను ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. ఆమె ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని డిపార్ట్​మెంటల్ స్టోర్ యాజమాన్యం తెలిపిందని అన్నారు. వ్యక్తిగత ప్రచారం, పుస్తకాల విక్రయాలు, రాజకీయ లబ్ధి కోసం కొందరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 'పిలాటస్​' ఒప్పందంలో అవినీతిపై సీబీఐ కేసు

ABOUT THE AUTHOR

...view details