బ్రెజిల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. కొవిడ్ మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని అత్యధిక జనాభా గల సావో పాలో రాష్ట్రంలోని 'విలా ఫార్మొసా' శ్మశానవాటిక మృతదేహాల దిబ్బగా మారింది. కొవిడ్ మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ శ్మశానవాటికలో రాత్రి 10 గంటల వరకు శవాల ఖననం చేసుకునేందుకు అనుమతించింది ప్రభుత్వం.
రాష్ట్రంలోని మరో మూడు శ్మశానవాటికల్లోనూ రాత్రి వరకు శవాల ఖననం జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వందల సంఖ్యలో మృతదేహాలు వస్తుండటం వల్ల 'విలా నొవా కషివోరిన్హా' శ్మశానవాటికలో స్థలం సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఈ శ్మశానవాటికను మూసివేశారు.