తెలంగాణ

telangana

ETV Bharat / international

ఏడాది తర్వాత దొరికిన టికెట్​తో లాటరీ కొట్టారు - Nicole Pedneault

కెనడాలోని క్యూబెక్​ నగరానికి చెందిన నికోల్ పెడ్న్యూల్ట్, రోజర్ లారోక్యూ​ దంపతులను చివరి క్షణంలో అదృష్టం వరించింది. లాటరీలో గెలుపొందిన టికెట్​ తమదేనని ఏడాది తర్వాత గుర్తించారు దంపతులు. వారికి 1 మిలియన్​ కెనడా డాలర్లు లభించాయి.

కెనడా దంపతులను వరించిన లాటరీ

By

Published : Apr 4, 2019, 9:20 AM IST

లాటరీ అంటే తెలియని వారుండరు. కొందరిని ఉన్నపళంగా కోటీశ్వరులను చేస్తుంది. అలాంటి లాటరీలో గెలుపొందిన టికెట్టు పోతే... తిరిగి ఓ అనుకోని రోజున దొరికితే.. చివరి క్షణంలో కోట్ల రూపాయలు మన సొంతమైతే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటనే క్యూబెక్​ నగరంలో నివసించే దంపతులకు ఎదురైంది.

నికోల్ పెడ్న్యూల్ట్, రోజర్ లారోక్యూ గత ఏడాది ప్రేమికుల రోజున లోటో క్యూబెక్​ సంస్థ లాటరీ టికెట్​ కొనుగోలు చేశారు. ఇంట్లోని ఓ పుస్తకంలో పెట్టి మరిచిపోయారు. ఏప్రిల్​ 5, 2018 రోజున తీసిన డ్రాలో అదే టికెట్​ లాటరీ గెలుపొందింది. కానీ ఆ దంపతులు ఎవరూ తమ టికెట్​కు బహుమతి వచ్చిందని గుర్తించలేకపోయారు. అసలు టికెట్​ కొనుగోలు చేసిన విషయమే మరిచారు.

వారం రోజుల క్రితం మనవడికి పాఠశాల ప్రాజెక్ట్​ విషయంలో సహాయం చేయడానికి ఆ పుస్తకాన్ని తీయటం వల్ల అందులోంచి ఏదో కిందపడినట్లు గమనించారు పెడ్న్యూల్ట్​. అది లాటరీలో గెలుపొందిన టికెట్​గా గుర్తించారు. ఇంకా టికెట్​ చెల్లుబాటులో ఉందని తెలుసుకుని సంస్థను సంప్రదించారు. 1 మిలియన్​ కెనడా డాలర్లు ( 5 కోట్ల 13 లక్షల 41 వేల 250 రూపాయలు) సొంతం చేసుకున్నారు.

"తన ప్రదర్శన కోసం మా మనవడు ఏదైనా ఇవ్వమని నన్ను అడిగి ఉండకపోతే, నేను టికెట్​ను ఎప్పటికీ గుర్తించలేకపోయేదానిని. మొదటగా టికెట్​ను గుర్తించిన వెంటనే అది చెల్లుబాటు అవుతుందో లేదో లోటో క్యూబెక్​ సంస్థ వెబ్​సైట్​ను చూశాను. " - పెడ్న్యూల్ట్

ABOUT THE AUTHOR

...view details