అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌కు కెనడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు కెనడా ఆరోగ్య సంరక్షణ నియంత్రణ విభాగం 'హెల్త్ కెనడా'.. ఫైజర్ సహా జర్మనీకి చెందిన బయోఎన్టెక్ల వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేస్తున్నట్లు తమ వెబ్సైట్లో ద్వారా వెల్లడించింది.
ఇందులో భాగంగా ఈ నెలలో 249,000 డోసులను, వచ్చే ఏడాది మార్చి లోపు మరో 40 లక్షల డోసులను అందుకోనుంది కెనడా.