తెలంగాణ

telangana

ETV Bharat / international

California Twins: కవల పిల్లలే.. కానీ పుట్టిన సంవత్సరాలు వేరు!

California Twins: 15 నిమిషాల వ్యవధిలో వేర్వేరు తేదీలు, సంవత్సరాల్లో కవలలు జన్మించారు. ఈ అరుదైన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఇదెలా జరిగిందంటే..?

California Twins
California Twins

By

Published : Jan 4, 2022, 5:39 AM IST

California Twins: అమెరికాలోని కాలిఫోర్నియాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 15 నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల పిల్లల పుట్టిన తేదీ, సంవత్సరాలు మారిపోయాయి. కలిసే జన్మించినప్పటికీ ఇకపై వారిద్దరు వేర్వేరు తేదీల్లో పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఇదెలా సాధ్యమైంది అని అనుకుంటున్నారా..?

కాలిఫోర్నియా రాష్ట్రం గ్రీన్‌ఫీల్డ్‌ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్‌కు డిసెంబరు 31న పురుటి నొప్పులు రావడంతో స్థానిక నతివిదాడ్‌ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. అదే రోజు రాత్రి 11.45 గంటలకు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. 15 నిమిషాల అనంతరం 12.00 గంటలకు ఆడ శిశువు ఈ లోకానికి హాయ్‌ చెప్పింది. దీంతో మగశిశువు 2021లో పుట్టగా.. పాప 2022లో జన్మించినట్లయింది. ఈ విషయాన్ని సదరు మెడికల్‌ సెంటర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. వారి ఫొటోలను ఫేస్‌బుక్‌లో పంచుకుంటూ తల్లితోపాటు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపింది.

కవలలకు జన్మనిచ్చిన ఫాతిమా మాడ్రిగల్‌

తన కవల పిల్లలు ప్రత్యేక తేదీల్లో జన్మించడంపై తల్లి మాడ్రిగాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. 'నా ట్విన్స్‌ వేర్వేరు పుట్టినరోజులు కలిగి ఉండటం క్రేజీగా ఉంది' అని అన్నారు. మగ శిశువుకు ఆల్ఫ్రెడో అని, పాపకు అలీన్‌ అని పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఔరా అనిపించే రోబోలు.. అచ్చం మనుషుల్లానే!

ABOUT THE AUTHOR

...view details