కరోనా నిబంధనలు ఉల్లంఘించి పలుమార్లు విమర్శలపాలైన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో.. తాజాగా మరోసారి కొవిడ్ నిబంధనలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాకర్ మ్యాచ్లు చూడాలనుకున్న తాను కరోనా నిబంధనల కారణంగా వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల సాంటోస్ నగరంలో జరిగిన 'బ్రెజిలియన్ ఛాంపియన్ షిప్'(Brazil Championship) మ్యాచ్ను చూసేందుకు తనను అధికారులు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
"వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రం ఉండాలా? నేను సాంటోస్కు వెళ్లి మ్యాచ్లు చూడాలనుకున్నాను. కానీ, అందుకు వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని వాళ్లు చెప్పారు. మ్యాచ్ చూడాలంటే.. వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకు?
-జైర్ బొల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు