కరోనాను ఎదుర్కొంటున్న తీరుతో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో చర్చనీయాంశమయ్యారు. తాజాగా దేశంలోని కరోనా మరణాలపై స్పందించిన తీరుతో మరోమారు వార్తల్లో నిలిచారు బొల్సొనారో.
బ్రెజిల్లో వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 71వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. తాజాగా మరణాల సంఖ్య(5,017) చైనాను దాటింది. దీనిపై ప్రశ్నించగా.. తానేమీ అద్భుతాలు చేయలేనని జవాబిచ్చారు అధ్యక్షుడు.
"మరణాల సంఖ్య పెరిగితే నన్నేం చేయమంటారు? నేనేనీ అద్భుతాలు చేయలేను."