Brazil landslides: భారీ వర్షాలు, వరదలతో బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి రియో డి జెనీరో రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరణాల సంఖ్య పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
Rio de Janeiro landslides
కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 180 మంది సైనికులను.. రియో డి జెనీరోకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు గంటల్లోనే 26 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వెల్లడించారు.
ఫలితంగా అనేక ఇళ్లు, వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. బాధితులకు సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులను ఆదేశించినట్లు బొల్సొనారో వెల్లడించారు.
ఇదీ చదవండి:ఓడ మునిగి ఏడుగురు మృతి.. 14 మంది గల్లంతు