చైనాతో అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. చైనా నిబంధనల ప్రకారం నడుచుకునేలా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ పర్యావరణ ఒప్పందంలో తిరిగి చేరబోతున్నట్లు ప్రకటించారు.
డెలావెర్ విల్మింగ్టన్లోని తన స్వస్థలంలో గవర్నర్లతో గురువారం సమావేశమయ్యారు బైడెన్. ఈ సందర్భంగా బీజింగ్ ప్రవర్తనను అనుసరించి చైనాపై ఆంక్షలు ఉంటాయని అధ్యక్ష సంవాదంలో పేర్కొనటంపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
" ఇది చైనాను శిక్షించటం గురించి కాదు. నిబంధనల మేరకు నడుచుకోవాలని చైనా అర్థం చేసుకునేలా చేయటం. అది సాధారణ ప్రతిపాదన. ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరబోతున్నాం. డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు అవసరం. అలాగే పారిస్ పర్యావరణ ఒప్పందంలోనూ చేరతాం. ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు వెళతాం."