తెలంగాణ

telangana

ETV Bharat / international

'మేం కలిసే ఉన్నాం... రష్యా, చైనా గుర్తించాలి!' - అమెరికా అధ్యక్షుడు ఐరోపా పర్యటన

ఐరోపా పర్యటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపాతో దౌత్యసంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని చైనా, రష్యాలకు పర్యటన సందర్భంగా స్పష్టం చేస్తానని తెలిపారు. పర్యటనలో భాగంగా రష్యా కవ్వింపు చర్యలకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ​

joe biden foreign trip, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పర్యటన
ఐరోపాతో బంధంపై బైడెన్​ కీలక వ్యాఖ్యలు

By

Published : Jun 9, 2021, 10:33 PM IST

అమెరికా-ఐరోపాల మధ్య బంధాలు మెరుగ్గానే ఉన్నట్టు చైనా, రష్యాలకు ఐరోపా పర్యటన సందర్భంగా స్పష్టం చేయనున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. జీ7 శిఖరాగ్ర సద్దుస్సులో భాగంగా ఐరోపాలో ఎనిమిది రోజల పాటు పర్యటించనున్న నేపథ్యంలో బైడెన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధ్యక్షుడిగా బైడెన్​కు ఇది తొలి విదేశీ పర్యటన.

బైడెన్​ లక్ష్యాలు..

మాజీ అధ్యక్షుడు ట్రంప్​ హయాంలో ఐరోపాతో దెబ్బతిన్న దౌత్యసంబంధాలను పునరుద్ధించడమే లక్ష్యంగా బైడెన్ ఈ పర్యటన చేపట్టనున్నారు. దీనితో పాటు చైనాను కట్టడి చేసేందుకు మిత్ర దేశాల మద్దతును కూడగట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. రష్యా అధ్యక్షుడితో జరిగే ప్రత్యేక భేటీలో భాగంగా ఆ దేశం అమెరికాపై కవ్వింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలని బైడెన్​ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి :నిఘా వైఫల్యంతోనే బీభత్సం: సెనేట్ నివేదిక

ABOUT THE AUTHOR

...view details