గత 40 ఏళ్లలో లేని విధంగా రానున్న నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోమవారం పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో స్వల్ప అడ్డంకులు ఎదురవతాయని తెలిపారు. గత రెండు నెలలుగా గణనీయంగా తగ్గిన ఉపాధి అవకాశాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
"అమెరికన్ల ఉద్యోగాలకు సంబంధించి ఓ ప్రణాళిక అవసరం. ఈ మేరకు ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రణాళికను రచించాం. దీని ద్వారా దేశంలోని ఉద్యోగులందరూ.. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి లాభపడేలా చర్యలు చేపట్టనున్నాం."