అధికారం చేపట్టిన వెంటనే చైనా ఎగుమతులపై సుంకాలను ఎత్తివేయబోనని స్పష్టం చేశారు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగిస్తానని తెలిపారు. అయితే భౌగోళిక, రాజకీయ శత్రువైన చైనాతో తన పరపతిని పెంచుకుంటానని అన్నారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
చైనాపై సుంకాలను వెంటనే ఎత్తివేయను: బైడెన్ - జో బైడెన్.
పదవీ బాధ్యతలు చేపట్టగానే చైనా ఎగుమతులపై ఉన్న సుంకాలను ఎత్తివేయబోనని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. ఆ దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
చైనాపై సుంకాలను వెంటనే ఎత్తివేయను: బైడెన్
ట్రంప్ హయాంలో అమెరికా, చైనాలు ఏడాది పొడవునా వాణిజ్య యుద్ధానికి పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకుంటానని జో బైడెన్ తెలిపారు. చైనాతో చర్చలు జరుపుతానని వెల్లడించారు.