అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అరుదైన ఘనత సాధించారు. మాజీ అధ్యక్షులు రొనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా తర్వాత.. బైడెన్ ప్రమాణస్వీకారాన్ని టీవీల్లో అత్యధిక మంది వీక్షించినట్లు.. ప్రముఖ సంస్థ నీల్సెన్ వెల్లడించింది.
ప్రమాణస్వీకార వీక్షణల్లో జో బైడెన్ రికార్డ్
అమెరికా మాజీ అధ్యక్షులు రొనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా తర్వాత జో బైడెన్ ప్రమాణస్వీకారాన్ని అత్యధిక మంది టీవీల్లో వీక్షించారు. ఈ మేరకు ప్రముఖ సంస్థ నీల్సెన్ వెల్లడించింది.
బైడెన్ ప్రమాణస్వీకారానికి రికార్డ్
బైడెన్ ప్రమాణ స్వీకారాన్ని 17 ఛానెళ్ల ద్వారా 3.38 కోట్ల మంది వీక్షించారని సంస్థ పేర్కొంది. 1981లో రీగన్ ప్రమాణ స్వీకార సమయంలో 4.18 కోట్ల మంది, 2009లో బరాక్ ఒబామా ప్రమాణ స్వీకారాన్ని 3.78 కోట్ల మంది వీక్షించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి :పుతిన్‌కు బైడెన్ ఫోన్- ఆ విషయాలపై ఆందోళన