దేశంలో కరోనా వ్యాక్సిన్ల సరఫరా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంపై విమర్శల వర్షం కురిపించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. పంపిణీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు అభిప్రాయపడ్డారు.
"ఇదే తీరులో వెళితే.. అమెరికన్లకు టీకా అందేసరికి నెలలు కాదు.. సంవత్సరాలు పడుతుంది."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.
తాను అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం.. రోజుకు మిలియన్ టీకాలు అందే విధంగా చర్యలు చేపడతానని హామీనిచ్చారు బైడెన్. అయినప్పటికీ.. అమెరికన్ జనాభాలో మెజారిటీ మందికి వ్యాక్సిన్ అందేసరికి నెలలు గడిచిపోతాయన్నారు.