టోర్నడో బీభత్సం- 50 మంది మృతి - టోర్నడో బీభత్సం
16:50 December 11
టోర్నడో బీభత్సం- 50 మంది మృతి
అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200మైళ్ల మేర పలు జిల్లాలను బలమైన టోర్నడో చుట్టేసినట్లు చెప్పారు.
కెంటనీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన టోర్నడోగా పేర్కొన్నారు బెషీర్. మృతుల సంఖ్య 70-100 మధ్యకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఓ క్యాండిల్ ఫ్యాక్టరీలో పైకప్పు కుప్పకూలటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు చెప్పారు.
కెంటనీ చరిత్రలో శుక్రవారం రాత్రి అత్యంత దుర్భరమైనదిగా అభివర్ణించారు గవర్నర్. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయ చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని, స్థానికంగా ఉండే పోలీసులు, ప్రభుత్వం ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శిథిలాల తొలగింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు.