అమెరికా లాస్ ఏంజెల్స్‌లో వేల మంది జనం రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆర్మేనియాలోని నాగొర్నో-కరాబాఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ఆజర్బైజాన్, టర్కీ సంయుక్తంగా కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆర్మేనియా కోసం అమెరికాలో భారీ ర్యాలీ
లాస్ ఏంజెల్స్‌లో జనం భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్టారు. నాగొర్నో-కరాబాఖ్ ప్రాంతం ఆక్రమణ కోసం అజర్బైజాన్, టర్కీ కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు.
నాగొర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆర్మేనియా-అజర్బైజాన్ మధ్య ఘర్షణ సెప్టెంబర్ 27న తీవ్ర రూపం దాల్చింది. పరస్పర దాడుల్లో వందలాది మంది మరణించారు. రష్యా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చినా... ఎంతో కాలం నిలవలేదు. ఒడంబడికను ఉల్లంఘించింది మీరంటే మీరంటూ ఆర్మేనియా-అజర్బైజాన్ పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఎక్కువగా ఉండే ఆర్మేనియా ప్రజలు ఈ నిరసనలు చేపట్టారు.
ఇదీ చదవండి:భూమి దిశగా దూసుకొస్తున్న పాత రాకెట్: నాసా