మాస్కు ధరించటానికి నిరాకరించిన ఓ ప్రయాణికుడిని విమానం నుంచి దించేసింది అమెరికన్ ఎయిర్‌లైన్స్. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తర్వాత ఆ వ్యక్తిపై నిషేధం విధించింది. ఈ ఘటన న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో జరిగింది.
ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటామని ఇటీవల విమానయాన సంస్థలు హామీ ఇచ్చాయి. అప్పటినుంచి ఇలాంటి ఘటన జరగటం ఇదే తొలిసారి.
''మాస్కు వినియోగించాలని సిబ్బంది అభ్యర్థించినా సంప్రదాయవాద ఉద్యమకారుడు బ్రండన్ స్ట్రాకా నిరాకరించాడు. డల్లాస్‌కు వెళుతున్న ఈ విమానంలో 122 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదట స్ట్రాకాను దించేసిన సిబ్బంది మరో విమానంలో అతడిని పంపారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం. మాతో ప్రయాణించాలనుకునే వినియోగదారులు అవసరమైన నిబంధనలను తప్పక పాటించాలి."