బాగ్దాద్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై జరిగిన దాడిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందని ఆరోపించారు. ఇస్లామిక్ దేశాల దాడిలో తమ పౌరులు మరణించినా.. అమెరికా ఆస్తులకు నష్టం వాటిల్లినా ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే దీనిని హెచ్చరికగా కాకుండా ముప్పుగా పరిగణించాలని ట్వీట్ చేశారు.
అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ ఉద్యమకారులకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన ఆందోళనలపై ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల్లోనే బాగ్దాద్లోనిఅమెరికా దౌత్యకార్యాలయంపై దాడిజరిగింది. ఈ ఘటనలో కార్యాలయంలోని అమెరికా సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదు.
బలగాల తరలింపు...
దాడితో అమెరికా అప్రమత్తమైంది. 730కుపైగా బలగాలను పశ్చిమాసియా దేశాలకు తరలిస్తోంది. అగ్రరాజ్య సిబ్బందికి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టు రక్షణశాఖ పెంటగాన్ వెల్లడించింది.