సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇతర సంస్థల నుంచి గట్టి పోటీని ఎదర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులను ప్రమాదంలోకి పడేసేలా వ్యవహరిస్తుందా అని తెలుసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల్లో దర్యాప్తునకు ఆదేశించినట్లు న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ లితిషియా జేమ్స్ తెలిపారు.
ఫేస్బుక్ చట్టాలను పాటిస్తూ, వినియోగదారులను గౌరవించాలని జేమ్స్ స్పష్టం చేశారు. వినియోగదారుల భద్రత, సమాచారం కొరకు ఎటువంటి చర్యలు తీసుకుంది? ప్రకటనపై రుసుములను పెంచిందా?.. ఇలా అన్ని కోణాలలో పరిశీలిస్తామని తెలిపారు.