గత కొన్ని నెలలుగా మెక్సికో సరిహద్దు నుంచి రికార్డు స్థాయిలో వలసవాదులు అమెరికాకు వచ్చి చేరుతున్నారు. వలస వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని, తిరిగి పంపేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. డిసెంబర్ 21 నుంచి 1,25,000 మందిని అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపింది.
అమెరికా సరిహద్దులో వలసవాదుల కష్టాలు!
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలసవాదులు నానావస్థలు పడుతున్నారు. ఎలాగైన అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలని పడిగాపులు కాస్తున్న వలసవాదులను స్మగ్లర్లు వివిధ మార్గాల్లో సరిహద్దు దాటిస్తున్నారు. గోడ రంధ్రం నుంచి, కంచె సందుల్లోంచి పారే నీటి ద్వారా... అమెరికాలోకి అక్రమంగా ప్రవేశింపజేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులతో సరిహద్దు దాటించే క్రమంలో పిల్లల ఏడుపులు వర్ణనాతీతం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
అమెరికా సరిహద్దులో వలసవాదుల కష్టాలు!
"పిల్లల్ని తీసుకుని సుదూరాలకు నడవడం, ఆకలిని, చలిని లెక్కచేయకపోవటం, అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండటం.. ఇలా ప్రతిదీ ఓ పెను సవాలే. పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేని ఇలాంటి ఓ స్థితిలో ఉండటం... ఇదంతా అర్థం చేసుకోవాలంటే నా జీవిత కాలం సరిపోదేమో."
-కోనీ ఫిలిప్స్, అధ్యక్షురాలు, లూథరన్ సామాజిక సంస్థ