9/11 ఉగ్రదాడులకు 18ఏళ్లు నిండిన నేపథ్యంలో అల్‌ఖైదా నాయకుడు అయ్మన్ అల్-జవహ్రి అమెరికా ట్విన్ టవర్స్ దాడి తరహాలోనే మరిన్ని దాడులు చేపట్టాలని పిలుపునిచ్చాడు. ఇందుకోసం అమెరికా, ఇజ్రాయెల్, రష్యా దేశాలను లక్ష్యంగా చేసుకోవాలని వీడియో ద్వారా సందేశమిచ్చాడు. జిహాద్ సంస్థల కార్యకలాపాలను నిరంతరం పరిశీలించే ఎస్ఐటీఈ నిఘా బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇదీ చూడండి:- 9/11 మారణహోమానికి 18 ఏళ్లు- వెంటాడుతున్న జ్ఞాపకాలు
9/11 దాడుల అనంతరం కొంతమంది ఉగ్రవాదులు అమెరికాకు చిక్కారు. వారిలో కొందరు.. చేసిన తప్పును అంగీకరించి జిహాద్‌ను వదిలేశారు. వారిపై జవహ్రి తీవ్ర విమర్శలు చేసినట్టు నిఘా బృందం తెలిపింది.
సెప్టెంబర్ 11, 2001న ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా.. అమెరికాలోని న్యూయార్క్‌లో మారణహోమం సృష్టించింది. విమానాన్ని హైజాక్ చేసి ప్రపంచ వాణిజ్య సముదాయాన్ని కూల్చివేసింది. ఈ ఘటనలో 3వేల మంది మరణించారు.
2011లో బిన్‌లాడెన్‌ను మట్టుబెట్టిన అనంతరం అల్‌ఖైదా నాయకుడి బాధ్యతలు చేపట్టాడు జవహ్రి.