Texas woman: తల్లితో కలిసి సూపర్ మార్కెట్‌కు వచ్చిన పసిపిల్లవాడిని 'కొందాం' అనుకున్న మహిళ కటకటాలపాలైంది. దాదాపు పదేళ్లు శిక్ష పడే అవకాశమున్న కేసులో విచారణ ఎదుర్కొంటోంది. అమెరికా టెక్సాస్ రాష్ట్రం క్రొకెట్లో జరిగిందీ ఘటన.
ముద్దుగా ఉన్నాడంటూ..
Texas Woman Arrested Walmart: ఓ మహిళ.. నెలల వయసున్న కుమారుడితో కలిసి గతవారం వాల్‌మార్ట్‌కు వచ్చింది. సెల్ఫ్ చెక్ఔట్ లైన్లో వేచి చూస్తుండగా.. నిందితురాలు రెబెకా లానెట్ టేలర్(49) మరో మహిళతో కలిసి వచ్చింది. ఆ పిల్లాడి జుట్టు, నీలి రంగు కళ్లు ఎంతో బాగున్నాయంటూ మాట కలిపింది. అతడ్ని ఎంతకు అమ్ముతావంటూ తల్లిని ప్రశ్నించింది. రెబెకా జోక్ చేస్తోందని అనుకుని.. ఆ మహిళ ఊరుకుంది.
కానీ రెబెకా టేలర్ మాత్రం అక్కడితో ఆగలేదు. "నా కారులో రెండున్నర లక్షల డాలర్లు ఉన్నాయి. పిల్లాడ్ని ఇస్తే ఆ డబ్బంతా నీకు ఇచ్చేస్తా" అని ఆఫర్ ఇచ్చింది. ఇంతలోనే టేలర్‌తో పాటు వచ్చిన మహిళ.. పిల్లాడి పేరు ఏంటని అడిగింది. తల్లి సమాధానం ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుందా అని ఆలోచించేలోపే.. టేలర్, ఆమెతో ఉన్న వ్యక్తి.. ఆ పిల్లాడ్ని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. అతడ్ని కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మాటలతో ఆ తల్లి ఒక్కసారిగా భయపడిపోయింది. అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయింది.
ధర పెంచి.. బెదిరించి..