తెలంగాణ

telangana

ETV Bharat / international

అగ్నిప్రమాదం-తల్లి సహా ఆరుగురు పిల్లల సజీవ దహనం - A mother and her six children died in misisippi

అమెరికా మిసిసిప్పీలోని ఓ ఇంట్లో చెలరేగిన మంటల్లో తల్లి సహా తన ఆరుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. తమ కుటుంబ సభ్యులను కాపాడునేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు ఆ పిల్లల తండ్రి. కాలిన గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Mississippi
తల్లి సహా ఆరుగురు పిల్లల సజీవ దహనం

By

Published : Feb 9, 2020, 7:07 AM IST

Updated : Feb 29, 2020, 5:16 PM IST

అమెరికాలోని మిసిసిప్పీ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. క్లింటన్​ ప్రాంతంలోని ఓ ఇంట్లో చెలరేగిన మంటల్లో తల్లి సహా తన ఆరుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. తన భార్య పిల్లలను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ తండ్రి.

కాలిన గాయాలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణించిన చిన్నారుల వయస్సు కేవలం 1-15 మధ్య ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదంకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అగ్ని ప్రమాదంలో దగ్ధమాన ఇల్లు

ఇదీ చదవండి: 'దేవ భూమి'లో హృదయాలయాలు.. వారి జీవితాల్లో వెలుగులు

Last Updated : Feb 29, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details